
Nara Lokesh – Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయని, ఇకపై ఈ మహా సంకల్పానికి ఎక్కడా విరామం అనేదే ఉండదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి ప్రాంతం మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు రాజకీయ ఉద్దేశాలతో అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు ఎదురైనా సరే.. రాజధాని నిర్మాణ పనులు ఏమాత్రం ఆగకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నాయని నిరూపిస్తూ, అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను లోకేష్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. Read Also ; ఏపీలో రుతుపవనాల జోరు: పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్, శాసనసభ (అసెంబ్లీ), హైకోర్టు భవనాలతో పాటు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల పనులు సమాంతరంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. వీటితో పాటు తాగునీరు, సాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న రిజర్వాయర్లు, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు (MLA), ఎమ్మెల్సీల (MLC) నివాస టవర్లు, మంత్రుల అధికారిక బంగ్లాల నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని డిజిటల్ సాక్ష్యాలతో సహా చూపించారు. ఇప్పటికైనా కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం రాజధానిపై చేస్తున్న దుష్ప్రచారాలను, తప్పుడు కూతలను ఆపాలని ఆయన హెచ్చరించారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకు సంబంధించి ఎలాంటి శక్తులు అడ్డుపడినా పనులు ఆగే ప్రసక్తే లేదని లోకేష్ ఈ వీడియో ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. AP Sachivalayam: వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు: విజయకుమార్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార