
Srisailam Temple Donation:శ్రీశైలంలో నిత్య అన్నదాన వితరణకు రూ.లక్ష విరాళం. శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకమునకు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ వాస్తవ్యులు కే.ఆనంద్


Srisailam Temple Donation:శ్రీశైలంలో నిత్య అన్నదాన వితరణకు రూ.లక్ష విరాళం. శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకమునకు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ వాస్తవ్యులు కే.ఆనంద్

Kalyandurgam News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విధ్వంసం నుండి వికాసం వైపు పాలన సాగుతోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణములోని ప్రజా వేదికలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాన ప్రసంగం చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత నారా లోకేష్ బాబుతో పాటు కేంద్రంలో సుస్థిర పాలన అందిస్తున్న మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపు పైనస్తోందని అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం వెనుకబాటుకు నిదర్శనంగా ఉందని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, పేద ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవసరమైన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజాభిమానం చురగొంటున్నామని అన్నారు. కళ్యాణదుర్గం ప్రాంత కరువుకు శాశ్వత పరిష్కారం చూపాలని బిటిపి-కుందుర్పి బ్రాంచ్ ద్వారా 114 చెరువులకు సాగునీరు అందించే కృషి ముందు చూపుతో ముందుకు సాగుతోందని, సీఎం చంద్రబాబు కూడా 2028 లోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని క్యాలెండర్ ప్రకటించడం అభివృద్ధికి సంకేతమని అన్నారు. Read Also:Gooty Train Robbery: మైసూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్! Kalyandurgam News: అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎవరెన్ని విమర్శలు చేసినా వెనుతిరిగేది లేదని, అభివృద్ధితో కళ్యాణదుర్గం నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేస్తామని హర్షద్వనాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున మార్కెట్ కమిటీ చైర్మన్ బోయ లక్ష్మీదేవి రమేష్ జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముప్పూరి దేవరాజ్ అనిల్ కుమార్,శ్రీరాములు పాల్గొన్నారు. Dhaka Summons Indian Envoy : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బంగ్లాదేశ్ పీఎం