కర్ణాటకలో దాగున్న కేరళ అందాలు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
Actor ProfilePolitician

కర్ణాటకలో దాగున్న కేరళ అందాలు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్

Total News1
Movie Updates0
Sources1
కర్ణాటకలో దాగున్న కేరళ అందాలు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
HMTV15 Jun 2026
కర్ణాటకలో దాగున్న కేరళ అందాలు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్

Anand Mahindra : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే చాలు.. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన షేర్ చేసే ట్రావెల్ పోస్టులు చూస్తే, "ఇంత అందమైన ప్రదేశం ఇండియాలో ఉందా? దీని గురించి మనకు ఇప్పటివరకు ఎందుకు తెలియదు?" అనిపించక మానదు. తాజాగా ఆయన కర్ణాటక తీరంలోని 'హొన్నావర్' (Honnavar) అనే ఒక ప్రశాంతమైన పట్టణం గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా హాలిడే ప్లాన్ అనగానే అందరికీ గోవా, కూర్గ్ లేదా కేరళ బ్యాక్‌వాటర్స్ గుర్తుకొస్తాయి. కానీ 'హొన్నావర్' అనే పేరు చాలా మంది వినను కూడా లేదు. జనాల రద్దీ లేకుండా ప్రశాంతంగా, అద్భుతమైన ప్రకృతి అందాలతో ఉన్న ప్రదేశాలను అన్వేషించే క్రమంలో తనకు ఈ ప్లేస్ దొరికిందని ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫోటోలను షేర్ చేశారు. "మనం ఎప్పుడూ కేరళ బ్యాక్‌వాటర్స్ గురించే గొప్పగా చెప్పుకుంటాం. కానీ కర్ణాటక తీరంలో అంతకంటే అందమైన, సమానమైన గుర్తింపు రావాల్సిన ఒక దాగి ఉన్న అద్భుతం ఈ హొన్నావర్" అని మహీంద్రా రాసుకొచ్చారు. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, అందమైన జలపాతాలలో ఒకటైన 'జోగ్ ఫాల్స్' అందరికీ తెలిసే ఉంటుంది. ఈ జలపాతానికి కారణమైన 'శరవతి నది' తన ఉధృతినంతా ముగించుకుని, చివరకు ప్రశాంతంగా సాగుతూ ఈ హొన్నావర్ వద్దకు వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది సముద్రంలో కలిసే చోట ఏర్పడిన మడ అడవులు (Mangrove forests), అద్దంలా మెరిసిపోయే ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్, మలుపులు తిరిగే నీటి మార్గాలు ఈ ప్రాంతాన్ని ఒక మాయా ప్రపంచంలా మార్చేశాయని మహీంద్రా కొనియాడారు. ఆయన షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరైనా సరే ఇక్కడికి వెళ్లాల్సిందే అనేలా ఉన్నాయి. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్ అయిన వెంటనే, గతంలో హొన్నావర్ సందర్శించిన కొందరు పర్యాటకులు తమ అనుభవాలను