కనుగుడ్డు పోవాల్సింది
Actor ProfileActor

కనుగుడ్డు పోవాల్సింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి
NTV Telugu13 Jul 2026
కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి

నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ఎంతలా శ్రమించాడో చిరంజీవి వివరిస్తూ, గతంలో తనకు జరిగిన ఒక ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక శ్రమను చిరంజీవి కొనియాడారు. "ఒక స్టార్ కొడుకుగా చరణ్ మెకానికల్‌గా నటించి వెళ్ళిపోవచ్చు. కానీ తను అలా చేయలేదు. తెల్లవారుజామునే లేచి కఠినమైన వర్కవుట్స్ చేయడం, పగలంతా యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొని, అలసిపోయి ఇంటికి వచ్చినా సరే.. రాత్రి మళ్ళీ జిమ్‌లో శ్రమించేవాడు. బాడీ సహకరించాలంటే ఇది తప్పదు అని తను చెప్తుంటే, వాళ్ళ అమ్మ ఎంతో బాధపడేది. కానీ కష్టాన్ని నమ్ముకున్నందుకు నాకు గర్వంగా అనిపించేది" అని చిరంజీవి అన్నారు. షూటింగ్ సమయంలో చరణ్‌కు జరిగిన ఒక ప్రమాదం గురించి చిరంజీవి తొలిసారి బయటపెట్టారు. "ఒకరోజు సడన్‌గా ఫోన్ వచ్చింది, చరణ్‌కు పెద్ద దెబ్బ తగిలిందని హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. కన్నంతా ఎర్రగా మారి, రక్తం కారుతున్న ఫోటో చూడగానే మేము ఎంతో కంగారుపడ్డాం. కనుగుడ్డుకు ప్రమాదం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ కాస్మెటిక్ సర్జన్ సుధాకర్ ప్రసాద్ గారు పరిశీలించి... కనుగుడ్డుకు ఏమీ కాలేదని, ఐబ్రో కింద బోన్ దగ్గర కట్ అయిందని చెప్పి 7-8 కుట్లు వేశారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం" అని ఆనాటి భయాందోళనలను పంచుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు 1983లో తాను నటించిన 'ఖైదీ' సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొచ్చాయని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో రన్నింగ్ ట్రైన్ కింద తాను డూప్ లేకుండా సాహసం చేసినప్పుడు తన తండ్రి కంగారుపడ్డారని.. "రేపు నీకు కొడుకు పుట్టి, వాడు స్టార్ అయి ఇలాంటి దెబ్బలు తింటే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది" అని తన

కన గ డ డ ప వ ల స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in