ఔట్ సోర్సింగ్
Actor ProfilePolitician

ఔట్ సోర్సింగ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ సిబ్బందికి గుడ్ న్యూస్
Telugu Times31 Aug 2026
ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ సిబ్బందికి గుడ్ న్యూస్

ఫస్ట్ తారీఖున జీతాల జమ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉద్యోగుల జీతాలను విడుదల చేసింది. జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రతి నెలా జీతాలు ఆలస్యం లేకుండా అందించాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల అమలులో భాగంగా ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌లో జాప్యం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్‌ బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ విభాగాలకు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈ అదేశాల అమలు.. జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్ధిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు బుధవారం జీతాలు జమ చేసినట్లు ఆర్ధిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Samayam Telugu30 Aug 2026
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలోని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇకపై రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా ప్రతి నెల 1వ తేదీనే ఠంఛనుగా జీతాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ.. ఆర్థిక శాఖ ఈ నెల నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగింది. ఈ నేపథ్యంలోనే వారి అకౌంట్లలో జూలై 1వ తేదీనే జీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతంలో జీతాలు ఆలస్యంగా రావడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్ణీత తేదీన జీతాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత శాఖలు జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నెల చివరి పని దినానికల్లా బిల్లుల పరిశీలన.. ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసి.. తదుపరి నెల మొదటి తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.ఈ నెల బిల్లులు సకాలంలో అందిన అన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం

ఔట స ర స గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in