
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, వర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ ధర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మోస్ట్ అవేటెడ్ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మెలోడియస్ లవ్ సాంగ్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ లవ్లీ మెలోడీ సాంగ్‌కు భరత్ మంచిరాజు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సింగర్ అభిజిత్ రావు తన గాత్రంతో ఈ విజువల్స్ ని మరింత ఫీల్ గుడ్‌గా మార్చేశారు. పూర్ణచారి అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. “హే ఓ సుకుమారి.. కన్నుల దారి, నీవైపే చేరే సుందరి..” అంటూ సాగే ఈ పాట ప్రేమలో పడిన ఒక సగటు యువకుడి అమాయకపు భావాలను చాలా చక్కగా ఆవిష్కరించింది. ఈ లిరికల్ వీడియోలో హీరో తిరువీర్ తన నిజాయితీ గల నటనతో, ఐశ్వర్య రాజేష్ తన అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ