
`సేవ్ ది టైగర్స్` అనే వెబ్ సిరీస్ తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. కామెడీకి కామెడీ, ఫ్యామిలీ అంశాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ, అలకలు, గొడవల ప్రధానంగా ఈ సిరీస్ సాగుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. భార్యల విషయంలో భర్తలు పడే బాధలను ఇందులో ఫన్నీగా,సెటైరికల్‌గా చూపించారు. ఆద్యంతం కామెడీ ప్రధానంగా సాగుతూ ఆకట్టుకుంటోది. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కొత్తగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతోంది. ఈ సిరీస్‌పై టీమ్ రియాక్ట్ అయ్యింది. జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ‘సేవ్ ది టైగర్స్ 3’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ భారీ స్థాయిలో వ్యూస్‌ని సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా ఒక సిరీస్‌కు వరుస సీజన్స్ వస్తున్నప్పుడు ఒత్తిడితో సక్సెస్ తగ్గిపోతుంది. కానీ సేవ్ ది టైగర్స్ సిరీస్ మాత్రం ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుని ఇప్పుడు మరింత ఆదరణతో దూసుకుపోతుంది. వరుస విజయాలతో షోరన్నర్ మహి వి రాఘవ్ తన ప్రతిభను మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ‘సేవ్ ది టైగర్స్’ మొదటి రెండు సీజన్లు, అలాగే ‘సైతాన్’ వంటి థ్రిల్లర్ ప్రాజెక్టులతో ఇప్పటికే హిట్ ట్రాక్‌లో ఉన్న ఆయన వెబ్ స్పేస్‌లో హిట్ రికార్డ్‌ను కొనసాగిస్తున్నారు. ఓ కథను కమర్షియల్‌గా, ఆకట్టుకునేలా రూపొందించటం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్‌కు ఒక ఫ్రాంచైజీని ఎలా స్ట్రాంగ్‌గా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్టైన్మెంట్ వ్యాల్యూని ఏమాత్రం తగ్గించకుండా రూపొందించడంలో ఆయన దిట్ట. `ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మన ప్రేక్షకులు ఇంకా అలవాటు