ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్
Actor ProfileActor

ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్

Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్, అదరహో అంతే
Asianet News Telugu13 Jun 2026
ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్, అదరహో అంతే

షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ థ్రిల్లర్ మూవీ దృఢం. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో విడుదలై క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంది. షేన్ నిగమ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు. మలయాళీ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. క్రైమ్ అంశం చుట్టూ ఇన్వెస్టిగేషన్ డ్రామాని నడిపిస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం మలయాళీ దర్శకుల స్టైల్. మార్టిన్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృఢం చిత్రం కూడా ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా ఉంది. చివరి 20 నిమిషాలు అయితే ఆడియన్స్ సీట్ ఎడ్జ్ పై కూర్చుని చూస్తారు. అంతలా ట్విస్ట్ లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అసలు దృఢం కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ (షేన్ నిగమ్) ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎస్సైగా విధుల్లో జాయిన్ అయ్యేందుకు కుజినీలం ప్రాంతంలో పోలీస్టేషన్ కి వెళతాడు. అది ఎంతో ప్రశాంతమైన వాతావరణం, మనుషులు ఉండే ప్రాంతం. క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఆ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తో పాటు మరికొందరు పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. విజయ్ ఎస్సై గా ఛార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే ఊరి చివర ఒక శవం గుర్తుపట్టలేని స్థితిలో బయట పడుతుంది. అక్కడి నుంచి వరుస సంఘటనలు జరుగుతాయి. ఆ మర్డర్ మిస్టరీ తేలకముందే ఆ ఊరిలో ఫైనాన్స్ కంపెనీలో రాబరీ జరుగుతుంది. మొత్తం 120 సవర్ల బంగారం, 50 లక్షల డబ్బు దొంగిలిస్తారు. మరికొన్ని రోజుల తర్వాత డ్యామ్ వద్ద మరో శవం బయటపడుతుంది. ఎస్సై విజయ్ తన టీంతో ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా దొరకదు. దీనితో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. త్వరగా కేసు పరిష్కరించాలి అని ఒత్తిడి చేస్తారు. ఈ క్రమంలో ఏం చేయాలో విజయ్ కి అర్థం కాదు. అప్పుడే మరో ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన