ఓటర్ల సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండాలి
Actor ProfilePolitician

ఓటర్ల సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండాలి

Total News1
Movie Updates0
Sources1
ఓటర్ల సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండాలి
Namasthe Telangana17 Jun 2026
ఓటర్ల సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండాలి

Harish Rao | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తుంటే.. ఆయనతో పాటే అలుగునూరు చౌరస్తాలో అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమానికి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనమన్నారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు ఎంతో నమ్మకం. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించేవారు. కేసీఆర్ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం పట్టి, తొలి రోజుల్లోనే ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఇది.నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కోసం మనం దీక్షలు చేశాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చారు.ఎస్పీ, డీఎస్పీ, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీసులు తెచ్చుకున్నాం. బస్టాండ్‌ను ఫుల్ ఫ్లెడ్జ్ డిపోగా మార్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును, గండి మహాసముద్రం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారు. SIR ఓటర్ల సర్వే విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు.. SIR ఓటర్ల సర్వే విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఇది చనిపోయిన, డబుల్ ఓట్లను తొలగించి జాబితాను సవరించే ప్రక్రియ.అధికారికంగా ఇందులో పార్టీలకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు (అంగన్వాడీ టీచర్లు) ఇంటింటికి వచ్చేటప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట వెళ్లాలి. ఎవరైనా అధికారులు సహకరించకపోతే ఏఆర్ఓ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయొచ్చు. ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు, ఓటరు నమోదు ఫారాలు నింపడంలో ప్రజలకు మనమే దగ్గరుండి సహాయపడాలని హరీశ్ రావు కోరారు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా చూసుకోవాలి. ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో క్రియాశీలకంగా