
తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా నిలిపివేసింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ముందస్తు సన్నాహాల్లో భాగంగా చేపట్టిన ఈ కీలక ప్రక్రియ శనివారం నుంచి పూర్తిగా ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం మ్యాపింగ్ పూర్తి కాకముందే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 35,985 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ మ్యాపింగ్ ప్రక్రియ జరిగింది. తెలంగాణలో మొత్తం 3,38,29,018 మంది ఓటర్లు ఉండగా, అధికారులు ఇప్పటివరకు 2,36,54,232 మంది, అంటే కేవలం 69.92 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్‌ను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 1,01,74,786 మంది ఓటర్లను మ్యాపింగ్ పరిధిలోకి తీసుకురావాల్సి ఉండగానే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ భారీ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఇందులో 33 మంది డీఈఓలు, 119 మంది ఈఆర్‌ఓలు, 867 మంది ఏఈఆర్‌ఓలతో పాటు 3,596 మంది అబ్జర్వర్లు, 35,985 మంది బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాల్లోని వివరాల ఆధారంగా ఈ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి విచారణ చేపట్టారు. విజయవంతంగా మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియలో ఎలాంటి గుర్తింపులు సమర్పించకపోయినా, వారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు. ఇప్పటివరకు పూర్తయిన 2.36 కోట్ల మ్యాపింగ్‌లో దాదాపు 89 లక్షల మంది ఓటర్ల వివరాల్లో అధికారులు లోపాలను గుర్తించారు. కొన్ని కుటుంబాల్లోని సభ్యుల వయసుకు, వారి మధ్య ఉన్న సంబంధాలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. పేర్లలో అక్షర దోషాలు కూడా బయటపడ్డాయి. అయితే, ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్యుమరేషన్ పత్రాలను నింపే సమయంలో వీరికి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ సమయంలో ఓటర్లు తమ