
OG 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఓజీ మూవీ చివరిలో స్పష్టం చేశారు. దీంతో అప్పటి నుంచి ఓజీ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం (జూన్ 21) ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు సుజీత్ ఈ చిత్రం విషయమై చర్చలు జరుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ తెలియజేసింది. ఈ మేరకు ఓ ఫోటోను కూడా పంచుకుంది. అయితే ఈ తాజా అప్‌డేట్‌లో ఓజీ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తావన లేకపోవడం ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘ఓజీ 2’ నిర్మాణ బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం నిర్మాణ సమయంలో కొన్ని ఆర్థిక అంశాలపై నిర్మాత దానయ్య, చిత్రబృందం మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చివరి దశ చిత్రీకరణలో జపాన్ షెడ్యూల్ కోసం అదనపు నిధులు ఇవ్వడంపై సమస్యలు తలెత్తినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. Maa Inti Bangaram : బాక్సాఫీస్ వద్ద సమంత జోరు.. మా ఇంటి బంగారం 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే? బ్రేక్ ఈవెన్‌కు ఇంకెంత కావాలంటే? As promised by @PawanKalyan , #OGUniverse discussions have begun with @Sujeethsign at Creative Works! @MusicThaman#OG2 — Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 21, 2026 ఆ పరిస్థితుల్లో దర్శకుడు సుజీత్ స్వయంగా ముందుకొచ్చి తక్కువ సిబ్బందితో జపాన్‌లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. షూటింగ్ ఖర్చుల కోసం తన సొంత కారు అమ్మినట్లు ప్రచారం జరిగింది. ఇక మూవీ విడుదల అనంతరం సుజీత్ కృషిని