ఓజీ టూర్ ఇండియా రద్దు.. భావోద్వేగానికి గురైన తమన్
Actor ProfileActor

ఓజీ టూర్ ఇండియా రద్దు.. భావోద్వేగానికి గురైన తమన్

Total News1
Movie Updates0
Sources1
ఓజీ టూర్ ఇండియా రద్దు.. భావోద్వేగానికి గురైన తమన్
Eenadu13 Jun 2026
ఓజీ టూర్ ఇండియా రద్దు.. భావోద్వేగానికి గురైన తమన్

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ సంగీత దర్శకుడు తమన్‌ హైదరాబాద్‌లో తలపెట్టిన లైవ్‌ కాన్సర్ట్‌ రద్దయింది. ‘ఓజీ టూర్ ఇండియా’ పేరుతో నిర్వహించనున్న ఈ కాన్సర్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా తమన్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నాకు, నా 56 మంది టీమ్‌ సభ్యులకు ఇది గుండెబద్దలయ్యే వార్త. ఓజీ టూర్‌ ఇండియా కోసం గత 45 రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ, అందరి అభిప్రాయాలను సానుకూల ధోరణతో పరిగణనలోకి తీసుకుంటూ వచ్చాం. మేమంతా ఒక బృందంగా మంచి జోష్‌తో ఈ కాన్సర్ట్‌ను నిర్వహించడానికి సమాయత్తమయ్యాం. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు. నేనెప్పుడూ ఆయనపట్ల విశ్వాసంతో ఉంటాను. అలాగే డెస్టినీని నమ్ముతా. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా మీ ప్రేమ, నమ్మకం. ఈసారి మరింత జోష్‌తో ఓజీ కాన్సర్ట్‌ ఉంటుంది. నా పునరాగమనం ఎప్పుడూ మరింత బలంగా ఉంటుంది’’ ఎక్స్‌ వేదికగా తమన్‌ శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో వేదిక వద్ద నీరు నిలిచిపోయిందని నిర్వాహకులు వెల్లడించారు. ఈవెంట్‌కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. ఈ ఈవెంట్‌ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌దర్శన్‌ దర్శకుడు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌