ఓఆర ఆర
Actor ProfileCelebrity

ఓఆర ఆర

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
ఓఆర్ ఆర్ పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
TV9 Telugu26 Aug 2026
ఓఆర్ ఆర్ పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్‌ను పట్టుకునే క్రమంలో.. ఎదురు తిరగడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో నిందితుడితోపాటు

ఓఆర్ ఆర్ పై మోస్ట్ వాంటెడ్ దొంగ కోసం హైడ్రామా
Sakshi25 Aug 2026
ఓఆర్ ఆర్ పై మోస్ట్ వాంటెడ్ దొంగ కోసం హైడ్రామా

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)పై గత అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఓ నేరస్థుడిను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై.. అతడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. చివరికి పోలీసులు కాల్పులకు దిగడంతో ఓఆర్‌ఆర్‌పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న భూషణ్‌ శ్రీకాంత్‌ కోసం గత నాలుగు రోజులుగా నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని బొంగులూరు ఎగ్జిట్‌ నంబర్‌-12 సమీపంలో ఓ డీసీఎం వాహనంలో దాక్కున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని చుట్టుముట్టి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్‌ వారిపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు హెచ్చరించినా లొంగకపోవడంతో, పరారిని అడ్డుకునేందుకు పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో కుప్పకూలిన శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాంత్‌తో పాటు డీసీఎంలో ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నల్లగొండ సీసీఎస్‌ అధికారులు విచారిస్తున్నారు. శ్రీకాంత్‌కు చికిత్స పూర్తయిన అనంతరం అతడిని నల్లగొండకు తరలించి, రహస్య ప్రాంతంలో విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వందకుపైగా కేసులు! కానిస్టేబుల్‌ హత్య కేసులోనూ.. భూషణ్‌ శ్రీకాంత్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, చోరీలు, దాడులు సహా 100కుపైగా క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్‌ హత్య కేసులో కూడా శ్రీకాంత్‌ ఏ-2 నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా కాలంగా పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ నిందితుడిని ఎట్టకేలకు నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు సాహసోపేతంగా పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాంత్‌ అరెస్టుతో

ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కారిడార్ .. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్
Oneindia Telugu27 May 2026
ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కారిడార్ .. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్

భాగ్యనగర వాసుల ప్రజా రవాణా వ్యవస్థను సంచలన మార్పులు చేసే భారీ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్‌ను 391 కిలోమీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ చుట్టూ పూర్తి మెట్రో కారిడార్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించి, ఆధునిక ప్రజా రవాణా సౌకర్యాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం 122.6 కిలోమీటర్ల మేర లైన్ల విస్తరణకు సంబంధించి రూ.38,595 కోట్లతో డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. ఇందులో నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు, జేబీఎస్ నుంచి మేడ్చల్ మరియు శామీర్‌పేట వరకు వంటి ముఖ్యమైన కారిడార్లు ఉన్నాయి. అంతేకాకుండా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను కూడా రెండో దశలోనే ప్రతిపాదించింది. ఈ లైన్‌ను మూడో దశగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158-160కిలోమీటర్ల మేర మెట్రో లూప్ నిర్మాణం ఈ మాస్టర్ ప్లాన్‌లో కీలకం. ఢిల్లీ మెట్రో లూప్ మాదిరిగా ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ద్వారా శివారుప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, చౌటుప్పల్, మేడ్చల్, శామీర్‌పేట, శంషాబాద్, తుక్కుగూడ, ఘట్‌కేసర్ వంటి ప్రాంతాలనుంచి నగరంలోకి వచ్చే లక్షలాది మందికి సౌకర్యం కలుగుతుంది. ఇది ట్రాఫిక్ సమస్యలను బాగా తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. మొత్తం మూడు దశల్లో 391 కిలోమీటర్ల

ఓఆర ఆర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in