
ఇంటర్నెట్ డెస్క్: ‘లెనిన్’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు అఖిల్. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. జులై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని షురూ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ (Akhil) ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపిన అఖిల్.. తాను ప్రస్తుతం ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత చిత్రాలకు భిన్నమైన కథతో అఖిల్ ఈసారి సిద్ధమయ్యారు. చిత్తూరు నేపథ్యంలో సాగే కథ ఇది. బలమైన భావోద్వేగాలు, ఆసక్తిని రేకెత్తించే కథనంతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచేలా ‘లెనిన్’ చిత్రం రూపుదిద్దుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలతో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna), సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని భావించారు. తర్వాత జూన్ 26కు వాయిదా వేశారు. ఇప్పుడు జులై 10వ తేదీని ఫైనల్ చేశారు (Lenin Release Date). గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు