ఒడిశా పాఠ్యపుస్తకాల్లో బాలీవుడ్ పాట.. వెలుగులోకి వేలకొద్దీ తప్పులు
Actor ProfileCelebrity

ఒడిశా పాఠ్యపుస్తకాల్లో బాలీవుడ్ పాట.. వెలుగులోకి వేలకొద్దీ తప్పులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒడిశా పాఠ్యపుస్తకాల్లో బాలీవుడ్ పాట.. వెలుగులోకి వేలకొద్దీ తప్పులు
AP7AM26 Aug 2026
ఒడిశా పాఠ్యపుస్తకాల్లో బాలీవుడ్ పాట.. వెలుగులోకి వేలకొద్దీ తప్పులు

ఒడిశాలో విద్యావ్యవస్థలో జరిగిన ఓ భారీ తప్పిదం తీవ్ర దుమారం రేపుతోంది. ఐదో తరగతి విద్యార్థుల కోసం ముద్రించిన ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో ఏకంగా ఓ ప్రముఖ బాలీవుడ్ సినిమా పాటను అచ్చు వేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విద్యాశాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఈ పొరపాటును ట్రోల్ చేయగా, మరికొందరు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలేం జరిగింది?ఒడిశా ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగిస్తున్న 5వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో ఈ పొరపాటు చోటుచేసుకుంది. 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిందీ చిత్రం 'హమ్ దిల్ దే చుకే సనమ్'లోని సూపర్ హిట్ పాట 'నిమ్మూడ నిమ్మూడ'ను యథాతథంగా ముద్రించారు. ఐశ్వర్య రాయ్‌పై చిత్రీకరించిన ఈ పాట, వాస్తవానికి ఓ రాజస్థానీ జానపద గీతం. పుస్తకాల ప్రింటింగ్ లేదా ప్రచురణ దశలో జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే ఈ భారీ తప్పిదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర విద్యావ్యవస్థ, పాఠ్యపుస్తకాల సమీక్షా కమిటీల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.తప్పుల జాతర.. ఇదొక్కటే కాదు!అయితే, ఈ సినిమా పాట ముద్రణ ఒక్కటే పొరపాటు కాదని, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పుస్తకాల్లో ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నాయని తేలడం గమనార్హం. మొత్తం పాఠ్యపుస్తకాల్లో 1,600కు పైగా తప్పులు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 8వ తరగతి పుస్తకాల్లోనే అత్యధికంగా 705 తప్పులు ఉన్నాయి. ఈ తప్పుల్లో కొన్ని విస్తుపోయేలా ఉన్నాయి. ఉదాహరణకు, కర్ణాటక అసెంబ్లీ భవనాన్ని ఒడిశా విధాన

ఒడ శ ప ఠ యప స తక ల ల బ ల వ డ ప ట వ ల గ ల క వ లక ద ద తప ప ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in