
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Devendra Fadnavis, Uddhav Thackeray flight journey). దేవేంద్ర ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించడం గురించి ఏక్‌నాథ్ సిండే (Eknath Shinde)కు ప్రశ్నలు ఎదురుయ్యాయి. ఈ ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ఫడణవీస్ చాలా తెలివైన వ్యక్తి అని, కుట్రలు పన్నే స్నేహితుడు ఎంత ప్రమాదకరమో ఆయనకు బాగా తెలుసని అన్నారు. 2019లో బీజేపీ, అవిభక్త శివసేన ఒకే విమానంలో ప్రయాణించాయని, అయితే ఆ తర్వాత ఠాక్రే వేరే విమానం ఎక్కి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. కాగా, తన రాజకీయ ప్రత్యర్థి ఫడణవీస్‌తో కలిసి విమాన ప్రయాణం చేయడం గురించి ఉద్దవ్ కూడా స్పందించారు (Maharashtra politics). తమ మధ్య చాలా ఉన్నత స్థాయి చర్చ జరిగిందని, ఆ సమావేశ ఫలితం రాబోయే రోజుల్లో తెలుస్తుందని అన్నారు. కాగా, ఫడణవీస్, ఉద్దవ్ ముంబై నుంచి నాగ్‌పూర్‌కు విమానంలో కలిసి ప్రయాణించడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలూ లేవని, వివిధ పార్టీల నాయకులు స్నేహపూర్వక వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తారని బీజేపీ పేర్కొంది. ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం