ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీ విప్లవం వచ్చాక, ప్రేక్షకులు థియేటర్ల వైపు రావాలంటే ప్రమోషన్ల ద్వారా క్రియేట్ చేసే హైప్ చాలా అవసరమవుతోంది. అందుకే ఇప్పటి తరం మేకర్స్ సరికొత్త ప్రచారాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రేసులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక కళ్లు చెదిరే సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’. జూన్ 19వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న సమంత.. కేవలం ఒకే ఒక్క రోజులో ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.* అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. ‘రాకా’ ఇంకా వెనక్కి వెళ్లిపోతుందా?సాధారణంగా ఒక సినిమా ప్రమోషన్స్ అంటే హీరో హీరోయిన్లు నాలుగైదు ఇంటర్వ్యూల్లో పాల్గొనడమే ఎక్కువ. కానీ సమంత మాత్రం తన సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి రాత్రి వరకు నాన్‌స్టాప్‌గా 40 డిజిటల్, లీడింగ్ మీడియా ఛానెళ్లకు వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒకే రోజులో ఈ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డని, ఇది సమంత డెడికేషన్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలన్నీ ఒకట్రెండు రోజుల్లో యూట్యూబ్ వేదికగా సందడి చేయనున్నాయి. ‘బాషా’ తరహా స్క్రీన్‌ప్లే.. చీరకట్టులో యాక్షన్ స్టంట్స్సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ క్లాసిక్ హిట్
Actor ProfileActor
ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు.. మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ లో సమంత ఆల్ టైమ్ రికార్డ్
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు.. మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ లో సమంత ఆల్ టైమ్ రికార్డ్