ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్
Actor ProfileCelebrity

ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్

Total News1
Movie Updates0
Sources1
ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్ పై వేటు
Sakshi16 Jun 2026
ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్ పై వేటు

ఐటీ రంగంలో కొన్ని స్టార్టప్‌ల పనితీరు, ఇంటర్న్‌ల పట్ల యాజమాన్యాల ధోరణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక చర్చ వైరల్‌ అవుతుంది. కేవలం అర్హతకు తగ్గ వేతనం (స్టైపెండ్) పెంచాలని వాట్సాప్‌లో మెసేజ్ పంపినందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌ను తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో నా ఇంటర్న్‌షిప్‌ను రద్దు చేశారు.. అంటూ సదరు టెక్కీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాధిత టెక్కీ కథనం ప్రకారం.. ఆమె ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఏఐ ఇంజినీర్ ఇంటర్న్‌గా చేరారు. ఆరు నెలల కాలపరిమితి గల ఈ ఇంటర్న్‌షిప్‌లో ఆమెకు అత్యంత స్వల్ప మొత్తాన్ని స్టైపెండ్‌గా నిర్ణయించారు. ఆ స్టార్టప్‌ సాంకేతిక విభాగంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆమే కావడం గమనార్హం. ఒక ఇంటర్న్ అయినప్పటికీ, సంస్థ కోసం ఆమె నిత్యం శ్రమిస్తున్నారు. కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ (ఎస్‌ఎల్‌ఎం)ను ఆమే స్వయంగా అభివృద్ధి చేశారు. సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి జాప్యం (Latency) తగ్గించేలా కోడింగ్‌ను ఆప్టిమైజ్ చేశారు. ఆమె ప్రతిభ కారణంగా సదరు స్టార్టప్‌కు ఏకంగా ఏడుగురు కొత్త క్లయింట్లు వచ్చారు. మూడు నెలల విజయవంతమైన పనితీరు తర్వాత ఆన్‌బోర్డింగ్ సమయంలో యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం స్టైపెండ్‌ రివిజన్ కోసం ఆమె మేనేజర్‌కు వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపారు. ‘హలో మేడమ్, నేను ఇక్కడ మూడు నెలలు పూర్తి చేసుకున్నాను. ఆన్‌బోర్డింగ్ సమయంలో మాట్లాడినట్లుగా నా స్టైపెండ్‌ రివిజన్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. గత 3 నెలల్లో నేను ఎస్‌ఎల్‌ఎం ఏజెంట్లను నిర్మించాను. వాటిని పరీక్షించాను. డెప్లాయ్‌ చేశాను. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా స్టైపెండ్‌ను కొంత మేర(XXXX) పెంచుతారని ఆశిస్తున్నాను. దీనిపై మరింత చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని రాశారు. కానీ, ఈ సాధారణ మెసేజ్‌ను మేనేజర్ జీర్ణించుకోలేకపోయారు. ‘ఒక విద్యార్థికి ఇంత పెద్ద

ఒక క వ ట స ప మ స జ ఐట ఇ టర న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in