ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?
Actor ProfilePolitician

ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Sept 2026
ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలను, మంత్రులను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే అసంతృప్తి మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ (Konidela Surekha) ని సభ్యురాలిగా చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ముఖ్యంగా కొణిదెల సురేఖ నియామకంపై “స్థానికత” అంశాన్ని లేవనెత్తుతూ కాంగ్రెస్ అంతర్గత వర్గాలతో పాటు తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె సామాజిక, రాజకీయ నేపథ్యం అంతా ఆంధ్రప్రదేశ్‌తోనే ముడిపడి ఉందని, తెలంగాణ సెంటిమెంట్‌తో కూడిన పవిత్రమైన యాదగిరిగుట్ట బోర్డులో ఆంధ్రా మూలాలున్న వ్యక్తికి ఎలా చోటు కల్పిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గత సంప్రదాయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, నల్గొండ జిల్లాకు అస్సలు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో ఆ ఆగ్రహం, సురేఖ వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. కేవలం చిరంజీవి కుటుంబంతో ఉన్న వ్యక్తిగత సత్సంబంధాల కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఆమె ఇన్నేళ్లల్లో కనీసం ఒక్కసారైనా యాదగిరి గుట్టకి వెళ్ళారా? లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఒక్క సందర్భం, ఫోటో చూపించమని తెలంగాణ వాదులు అడుగుతున్నారు. అయితే ఈ విమర్శల్ని మెగాభిమానులు గట్టిగా తిప్పికొడుతున్నారు. గత 35 ఏళ్లుగా సురేఖ, హైదరాబాద్ లోనే ఉంటున్నారని, ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఆమెను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు

ఒక కస ర న య దగ ర గ ట టక వ ళ ళ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in