Rafael Grossi IAEA Chief Interview : ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న తరుణంలో.. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు అరుదైన మైలేజ్ లభించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే డిమాండ్ అత్యంత సహేతుకమైనదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధినేత రాఫెల్ మరియానో గ్రాస్సీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్ రేసులో అత్యంత కీలక అభ్యర్థిగా ఉన్న గ్రాస్సీ.. వియన్నాలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ అణు పర్యవేక్షణ సంస్థ అధినేతగా, సుదీర్ఘ అనుభవం ఉన్న అంతర్జాతీయ దౌత్యవేత్తగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు భద్రతా మండలి విస్తరణపై భారత్ చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి బలమైన మద్దతుగా నిలిచాయి.1945 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు..!ఐక్యరాజ్యసమితి ప్రస్తుత నిర్మాణాన్ని మార్చాల్సిన అవసరాన్ని రాఫెల్ గ్రాస్సీ బలంగా సమర్థించారు. "భారత్ లాంటి దేశాలు ఈ రకమైన ఆకాంక్షను కలిగి ఉండటం కేవలం సహేతుకం మాత్రమే. ఎందుకంటే 1945 నాటి ప్రపంచం వేరు, ప్రస్తుత 2026 నాటి ప్రపంచం వేరు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత నిర్మాణం పాతబడిపోయిందని, సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా తక్షణ సంస్కరణలు అవసరమని భారత్ ఎప్పటి నుంచో చెప్తున్న వాదనతో ఆయన ఏకీభవించారు. అయితే ఒక దౌత్యవేత్తగా సమతుల్యతను పాటిస్తూ.. ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి కొన్ని పరిమితులు ఉంటాయని.. ఎవరికి సభ్యత్వం ఇవ్వాలనేది సభ్య దేశాల మధ్య విస్తృతమైన ఒకకాభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు. కానీ అధికారిక సభ్యత్వంతో సంబంధం లేకుండానే నేడు ప్రపంచంలో భారత్ యొక్క ప్రభావం, ఆర్థిక, భౌగోళిక రాజకీయ బలం ఎవరూ తిరస్కరించలేని విధంగా పెరిగిందని ఆయన కొనియాడారు.ఐరాస అత్యున్నత పదవికి రేసు..!ప్రస్తుత యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రెండో విడత పదవీ కాలం 2026 డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో 2027 జనవరి నుంచి కొత్త
Actor ProfilePolitician
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత స్థానం సహేతుకం
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•13 Jun 2026
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత స్థానం సహేతుకం