
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ స్టేజ్ షోలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ, యూరప్‌లోని వేదికలను షేక్ చేస్తోంది. 'మోహన్‌లాల్ లైవ్: బియాండ్ ది స్క్రీన్' అనే మెగా షోలో భాగంగా జర్మనీలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వేడుకలో తన వయసును మించిన అద్భుతమైన హుందాతనం, శక్తితో మోహన్‌లాల్ వేదికపైకి అడుగుపెట్టడాన్ని చూసి, ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, అంకితాభావాన్ని అంగీకరించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ప్రదర్శనలలో ఎల్లప్పుడూ గొప్ప షోమన్‌గా మెరిసే మోహన్ లాల్.. ఇప్పుడు విదేశీ మలయాళీ ప్రేక్షకులకు మరోసారి మరపురాని మెమురీస్ అందించారు. ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా.. జర్మనీలో వేదికపై నృత్యం, గానంతో మోహన్‌లాల్ ప్రేక్షకులను ఉత్సాహపు స్థాయికి తీసుకువెళ్లారు. సూపర్ హిట్ చిత్రం 'గాంధర్వం'లోని "నెంజిళ్ కంచబనం..." అనే ఆల్ టైమ్ ఫేవరేట్ పాటను మోహన్‌లాల్ వేదికపై పాడి ప్రదర్శించారు. ఈ పాటతో పాటు, యువ మలయాళ నటీమణులు స్వాసిక, సానియా అయ్యప్పన్‌లతో కలిసి ఆయన చేసిన అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ హై వోల్టేజ్ ప్రదర్శనను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో.. ఈ యూరోపియన్ టూర్‌లో మోహన్‌లాల్‌తో పాటు పెద్ద ఎత్తున స్టార్ కాస్ట్ చేరుతోంది