ఏళ్లు విమానాశ్రయంలోనే జీవనం.. ఎవరీ మెహ్రాన్ కరీమి నస్సేరి? హాలీవుడ్ ను కదిలించిన నిజజీవిత కథ
Actor ProfileActor

ఏళ్లు విమానాశ్రయంలోనే జీవనం.. ఎవరీ మెహ్రాన్ కరీమి నస్సేరి? హాలీవుడ్ ను కదిలించిన నిజజీవిత కథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్లు విమానాశ్రయంలోనే జీవనం.. ఎవరీ మెహ్రాన్ కరీమి నస్సేరి? హాలీవుడ్ ను కదిలించిన నిజజీవిత కథ
10TV Telugu7 Aug 2026
ఏళ్లు విమానాశ్రయంలోనే జీవనం.. ఎవరీ మెహ్రాన్ కరీమి నస్సేరి? హాలీవుడ్ ను కదిలించిన నిజజీవిత కథ

Mehran Karimi Nasseri : పాస్‌పోర్టు పోవటంతో అతని జీవితమే విమానాశ్రయంలో బందీ అయిపోయింది.. ప్రపంచమంతా తిరగాల్సిన వ్యక్తి ఒకే టెర్మినల్ లో ఏకంగా 18ఏళ్లు గడపాల్సి వచ్చింది.. బెంచ్‌నే ఇల్లుగా, ప్రయాణికులనే కుటుంబంగా మార్చుకొని జీవించిన అతని కథ కోట్ల మందిని కదిలించింది. చివరకు అదే విమానాశ్రయంలో గుండెపోటుతో కన్నుమూసిన అతని జీవితం హాలీవుడ్ వరకు చేరి.. ‘ది టెర్మినల్’ సినిమాకు స్ఫూర్తిగా నిలిచింది.. ఒక్క పత్రం లేకపోతే మనిషి ఎంతటి కష్టాల్లో పడతాడో ప్రపంచానికి గుర్తు చేసిన విషాదమైన నిజ జీవిత కథ ఇది. ఇరాన్‌కు చెందిన మెహ్రాన్ కరీమి నస్సేరి జీవితం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన మానవ కథల్లో ఒకటిగా నిలిచింది. ఒక పాస్‌పోర్టు పొగొట్టుకోవడంతో మొదలైన సమస్య.. ఆయనను ఏకంగా 18ఏళ్లపాటు ప్రాన్స్‌లోని పారిస్ చార్లెస్ డి గాల్ విమానాశ్రయంలోనే బంధించింది. ఈ అసాధారణ జీవితం తరువాత హాలీవుడ్ లో టామ్ హ్యాంక్స్ నటించిన ‘ది టెర్మినల్’ చిత్రానికి స్ఫూర్తిగా మారింది. 1945లో ఇరాన్‌లో జన్మించిన మెహ్రాన్ కరీమి నస్సేరి ఉన్నత విద్యకోసం బ్రిటన్ వెళ్లారు. అనంతరం యూరప్‌లో ప్రయాణిస్తుండగా 1988లో ఆయన పాస్‌పోర్టు, ఇతర పత్రాలు పోయాయి. అవి పోయాయా లేదంటే.. ఎవరైనా దొంగిలించారా అనే విషయంపై భిన్న కథనాలు ఉన్నాయి. అయితే, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడంతో ఆయన చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. దీంతో విమానాశ్రయం అధికారులు బ్రిటన్‌లోకి అనుమతించలేదు. తిరిగి ఫ్రాన్స్‌కు పంపించారు. అక్కడా సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి అధికారులు కూడా ఆ దేశంలోకి ప్రవేశానికి అనుమతించలేదు. దీంతో ఆయన పారిస్ చార్లెస్ డి గాల్ విమానాశ్రయం టెర్మినల్ -1లోనే చిక్కుకుపోయారు. మెహ్రాన్ కరీమి నస్సేరి రోజులు గడిచే కొద్దీ టెర్మినల్‌నే తన ఇంటిగా మార్చుకున్నాడు. అక్కడి బెంచ్ పైనే నిద్రపోయేవాడు. విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణికులు ఇచ్చిన ఆహారంతో జీవనం సాగించేవాడు. పుస్తకాలు చదవడం, డైరీ రాయడం ఆయన దినచర్యగా మారింది. అక్కడి

ఏళ ల వ మ న శ రయ ల న జ వన ఎవర మ హ ర న కర మ నస స ర హ ల వ డ న కద ల చ న న జజ వ త కథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in