దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. తాజాగా ఈ చిత్రంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురించించారు.‘సింగ్ గీతం’ సినిమా చూసిన ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ పోటీ పెట్టారు. ఇది హృదయాన్ని తాకే అద్భుతమైన సినిమా అని పేర్కొన్న తారక్.. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మకత, కథల పట్ల ఉన్న తపన, ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన నాగ్ అశ్విన్ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. నాలుగు దశాబ్దాలుగా సింగీతం డ్రీమ్ గా ఉన్న ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఆయనకు ఈ సినిమా అందమైన నివాళిగా నిలిచిందన్నారు.దేవిశ్రీ ప్రసాద్ పనితీరును ఎన్టీఆర్ ప్రశంసించారు. డీఎస్పీ అందించిన సంగీతం సినిమాలోని భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలకు చేరవేసి, కథకి బలాన్ని ఇచ్చిందన్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అనుసరించిన వినూత్న విధానం తనను ఎంతో ఆకట్టుకుందని తారక్ పేర్కొన్నారు. మామూలుగా అందరూ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ను రిలీజ్ చేస్తే, ఇక్కడ సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ను లాంచ్ చేయడం తనని సర్పైజ్ చేసిందన్నారు. ఈ సందర్భంగా ‘సింగ్ గీతం’ ట్రైలర్ ను ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.''సింగ్ గీతం' నా హృదయానికి హత్తుకున్న ఒక అద్భుతమైన చిత్రం. 94 ఏళ్ల వయసులోనూ లెజండరీ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలిలో సృజనాత్మకతను
Actor ProfileActor
ఏళ్ల వయసులోనూ సింగీతం విజన్ స్ఫూర్తిదాయకం’.. సింగ్ గీతం’
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
ఏళ్ల వయసులోనూ సింగీతం విజన్ స్ఫూర్తిదాయకం’.. సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలు