ఏళ్ల తర్వాత విశాఖ
Actor ProfilePolitician

ఏళ్ల తర్వాత విశాఖ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్ మెరైన్లు
Samayam Telugu18 Jun 2026
ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్ మెరైన్లు

బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్థాన్ తోకముడిచింది. ఇండియన్ నేవీ దెబ్బకు దాయాది మరోసారి బంగాళాఖాతంలోకి కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల తర్వాత పాక్ కన్ను బంగాళాఖాతంపై పడిందా? ఈ జలాల్లో సబ్‌మెరైన్లు మోహరించే ప్రయత్నాల్లో ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన సీనియర్‌ అధికారి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తన నౌకాదళంలోకి చైనా తయారుచేసిన హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రణాళికలను పాకిస్థాన్ వేగవంతం చేసింది. మొత్తం 8 హంగోర్‌ శ్రేణి సబ్‌మెరైన్ల కొనుగోలుకు చైనాతో ఒప్పందం చేసుకోగా.. ఇటీవలే ఒక జలాంతర్గామిని పాక్‌కు అందజేసింది. స్వదేశానికి దానిని తరలిస్తుండగా.. ఎస్కార్ట్‌గా వస్తున్న ఫ్లోటిల్లా నౌక కమాండర్‌ కమోడోర్‌ ఒమర్‌ ఫరూఖీ శ్రీలంకలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘‘హంగోర్ శ్రేణి సబ్‌మెరైన్లతో మా నౌకాదళ సామర్థ్యం అరేబియాను దాటి విస్తరించనుంది. వీటి ద్వారా బంగాళాఖాతంలోనూ మా సైనికశక్తిని విస్తరించే అవకాశం దక్కుతుంది. ఇవి గేమ్‌ఛేంజర్‌ జలాంతర్గాములు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ జలాంతర్గాములను బంగాళాఖాతంలో పాకిస్థాన్ మోహరించే ప్రణాళికలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు తీరంలోని బంగాళాఖాతం భారత్‌కు అత్యంత కీలకమైంది. ఈ తీరంలో భారత్‌తో సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేసియాలు ఉన్నాయి. తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. అలాగే, 200 నాటికల్‌ మైళ్ల వరకు ప్రత్యేక ఎకనమిక్‌ జోన్‌ ఉంటుంది. అది దాటితే అంతర్జాతీయ జలాలే. అంటే, అక్కడ ఏ దేశానికి చెందిన సైనిక నౌకలు, జలాంతర్గాములు స్వేచ్ఛగా సంచరించవచ్చు. వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన ఈ ప్రాంతంలో తూర్పు నావెల్‌ కమాండ్‌ ఉంటుంది. విశాఖ కేంద్రంగానే భారత అణు జలాంతర్గాములు రూపొందుతాయి. అంతేకాదు వాటిని నిలిపి ఉంచే ‘ఐఎన్‌ఎస్‌ వర్ష’ కూడా ఇక్కడే ఉంది. గతంలో పాకిస్థాన్ ఏజెంట్లను విశాఖలో