ఏళ్లుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్.. ప్రేమ వేదన.. ఆ పాట రహస్యం ఇదే
Actor ProfileActor

ఏళ్లుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్.. ప్రేమ వేదన.. ఆ పాట రహస్యం ఇదే

Total News1
Movie Updates0
Sources1
ఏళ్లుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్.. ప్రేమ వేదన.. ఆ పాట రహస్యం ఇదే
TV9 Telugu16 Jun 2026
ఏళ్లుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్.. ప్రేమ వేదన.. ఆ పాట రహస్యం ఇదే

మణిరత్నం దర్శకత్వంలో, ఏ.ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన 'రావణన్' (తెలుగులో 'విలన్') గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయగా ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రంలోని పాటలు అద్భుతమైన ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని 'ఉసురే పోగుదే' తెలుగులో ఉసురే పోయేనే పాట వినగానే మనసును హత్తుకుంటుంది. ఈ పాటలోని సాహిత్యం గురించి, ముఖ్యంగా అందులో కవి వైరముత్తు వాడిన "తగైవిలాన్ కురువి" (Thagaivilan Kuruvi) అనే పదం వెనుక ఉన్న లోతైన అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాట ఒక విభిన్నమైన ప్రేమకథను ప్రతిబింబిస్తుంది. ఒకవైపు ప్రేమను వ్యక్తపరుస్తూనే, మరోవైపు ఆ ప్రేమలోని నైతికతను, దూరాన్ని కూడా కవి చాలా జాగ్రత్తగా కవిత్వీకరించారు. విక్రమ్, ఐశ్వర్యారాయ్ పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలను, వారి మధ్య ఉన్న దూరాన్ని వైరముత్తు తన కలంతో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్.. ఈ పాటలో వచ్చే "తగైవిలాన్ కురువి ఎన్నై తళ్ళి నిన్ను సిరిక్కుదడి" (తగైవిలాన్ పక్షి నన్ను దూరంగా నిలబడి చూసి నవ్వుతోంది) అనే చరణం చాలా ప్రత్యేకం. సాధారణంగా పక్షుల గురించి చెప్పేటప్పుడు ఎన్నో రకాలను పేర్కొనవచ్చు, కానీ వైరముత్తు ప్రత్యేకంగా ఈ పక్షిని ఎందుకు ఎంచుకున్నారంటే.. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 'తగైవిలాన్ కురువి' అనే పక్షి భూమిపైకి దిగకుండా, ఆకాశంలోనే నిరంతరం ఎగురుతూ ఉంటుందట. ప్రేమలో ఉన్న ప్రేమికులిద్దరి మధ్య ఎంతటి దూరం ఉందో, వారిద్దరి ప్రపంచాలు ఎంత భిన్నంగా ఉన్నాయో చెప్పడానికి కవి ఈ పక్షిని ఒక రూపకంగా (Metaphor) ఉపయోగించారు. ఆ పక్షి ఆకాశంలో ఎలాగైతే ఎప్పటికీ అందుబాటులోకి

ఏళ ల గ య ట య బ న ష క చ స త న న స గ ప ర మ వ దన ఆ ప ట రహస య ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in