ఏళ్ల కెరీర్.. కోట్ల రెమ్యునరేషన్.. సమంత మొత్తం ఆస్తులు ఎంత
Actor ProfileActor

ఏళ్ల కెరీర్.. కోట్ల రెమ్యునరేషన్.. సమంత మొత్తం ఆస్తులు ఎంత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల కెరీర్.. కోట్ల రెమ్యునరేషన్.. సమంత మొత్తం ఆస్తులు ఎంత
Zee Telugu17 Jun 2026
ఏళ్ల కెరీర్.. కోట్ల రెమ్యునరేషన్.. సమంత మొత్తం ఆస్తులు ఎంత

Samantha Lifestyle: చెన్నైలో జన్మించిన సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది. అనంతరం దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, రంగస్థలం, మహానటి, ఓ బేబీ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనాయికగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఓటీటీ ప్రపంచంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అలాగే పుష్ప చిత్రంలోని ఊ అంటావా పాటతో పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించింది. సినిమా కెరీర్‌లో సాధించిన విజయాలతో పాటు సమంత భారీ స్థాయిలో సంపదను కూడబెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ మీడియా కథనాల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రూ.100 కోట్ల నుంచి రూ.125 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా ఆమె ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పలు ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సమంత ప్రకటనల ద్వారా కూడా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న పాన్ ఇండియా గుర్తింపు కారణంగా ప్రముఖ కంపెనీలు ఆమెతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. నటనతో పాటు వ్యాపార రంగంలోనూ సమంత తన ముద్ర వేస్తోంది. నిర్మాణ సంస్థను ప్రారంభించి కంటెంట్ క్రియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫ్యాషన్, పెర్ఫ్యూమ్ రంగాల్లో కూడా వ్యాపారాలు నిర్వహిస్తూ తన ఆదాయ వనరులను విస్తరించుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలోనూ సమంత పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రచారం

ఏళ ల క ర ర క ట ల ర మ య నర షన సమ త మ త త ఆస త ల ఎ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in