ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది
Actor ProfilePolitician

ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది
Oneindia Telugu2 Aug 2026
ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు రైతులు కళ్లనీళ్లు పెట్టుకుని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు.నాలుగు జిల్లాల తలరాతను మార్చే వెలిగొండప్రాజెక్టు కోసం భూములను వదులుకోవడం అంటే అది సామాన్యమైన త్యాగం కాదని, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను త్యాగం చేశారని సీఎం అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్యలతో అల్లాడుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు, 1985లోనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. 1996లో తాము శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును, అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలు ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం వివరించారు. ఏపీ, తెలంగాణా జలజగడం పరిష్కారం కాదా .. తాజాగా వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్ట్ లపై కొత్త పంచాయితీఆర్ అండ్ ఆర్ నిధుల విడుదలవెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 10,580 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో ఇప్పటికే రూ. 6,736 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. మిగిలిన రూ. 3,844 కోట్లను త్వరితగతిన ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2024లో తమ ప్రభుత్వం వచ్చాక రూ. 759 కోట్లు ఖర్చు

ఏళ ల కల న జమవ త ద 4 జ ల ల ల తలర త మ రబ త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in