ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం
Actor ProfilePolitician

ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం
Sakshi29 Jun 2026
ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం

“పిల్లలు సెటిల్‌ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్‌ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం. వైద్యురాలు డాక్టర్‌ ధివ్య ధ్యానా సోషల్‌ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్‌ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట. చివరకు రిటైర్మెంట్‌ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్‌ బుకింగ్‌లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్‌ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ

ఏళ ల ఎద ర చ ప వ ధ ఆడ న వ త న టక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in