ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది
Actor ProfilePolitician

ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది

Total News1
Movie Updates0
Sources1
ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది
AP7AM15 Jun 2026
ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది

పెట్టుబడుల విషయంలో భారతీయులకు బంగారంపై ఉన్న నమ్మకం చాలా ప్రత్యేకమైనది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఆదుకునేది బంగారమే అన్న భావన చాలా కుటుంబాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగులు భవిష్యత్‌ భద్రత కోసం ఈపీఎఫ్‌పై ఆధారపడుతుంటారు. ఒకటి సంప్రదాయ పెట్టుబడి మార్గం అయితే.. మరొకటి పదవీ విరమణ తర్వాత ఆర్థిక అండగా నిలిచే పథకం. మరి గత 15 ఏళ్లలో ఈ రెండింటిలో ఏది పెట్టుబడిదారులకు ఎక్కువ సంపదను సృష్టించింది? లెక్కలు ఆసక్తికర విషయాలను చెబుతున్నాయి.భారీగా పెరిగిన విలువగత 15 ఏళ్లలో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. 2011లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సగటున రూ.25,700 ఉండేది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం ధరలకు ఊతమిచ్చాయి. ఫలితంగా 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.1.46 లక్షల స్థాయికి చేరుకుంది. ఈ కాలంలో బంగారంలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తికి సగటున 12.2 శాతం వార్షిక రాబడి లభించినట్లు అంచనా. దీంతో అతని పెట్టుబడి విలువ రూ.5.62 లక్షలకు పెరిగింది. అంటే అసలు పెట్టుబడిపై రూ.4.62 లక్షల లాభం వచ్చినట్లవుతుంది.స్థిరత్వానికి ఈపీఎఫ్‌ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు సాధనాల్లో ఒకటి. ప్రతి నెల ఉద్యోగి, యజమాని చెల్లించే మొత్తాలపై ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ వర్తిస్తుంది. మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా