
దేశ సంస్కృతి, హస్తకళల వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల నేతలకు ఆయన అందించే బహుమతుల్లో ఇవే ఉంటాయి. ఇవి వస్తువులుగా మాత్రమే కాకుండా, ఇరు దేశాల మధ్య ఉండే చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తాయి. వీటిని నిలబెట్టుకోవడంలో ఆయన ఓ అడుగు ముందే ఉంటారు.ప్రస్తుతం ప్రధాని మోదీ సెషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వాధినేతలకు మోదీ అందించిన కానుకలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. మేక్ ఇన్ ఇండియా గొప్పదాన్ని చాటిచెప్పేలా వీటిని ఏరికోరి ఎంపిక చేసుకున్నారాయన. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, సిక్కిం విశిష్ట కళా నైపుణ్యాలను ఈ కానుకల ద్వారా సెషెల్స్ దేశ ప్రముఖులకు పరిచయం చేశారు ప్రధాని మోదీ.మొరాదాబాద్ ఇత్తడి తాబేలు..సెషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీకి ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన మొరాదాబాద్ ఇత్తడి తాబేలును బహుమతిగా ఇచ్చారు. భారత బ్రాస్ సిటీగా మొరదాబాద్ కు పేరుంది. ఇక్కడి కళాకారులు ఈ అద్భుతమైన తాబేలును తయారు చేశారు. దీని కవచంపై చెక్కిన నగిషీలు, మెరిసే ఇత్తడి పూత తరతరాలుగా వస్తున్న వారి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. లోహాలను కరిగించి, విభిన్న రూపాలుగా మలచడంలో కళాకారులు సిద్ధహస్తులు.భారతీయ సనాతన ధర్మం, తత్వశాస్త్రంలోనూ తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, స్థిరత్వం, శతాధిక ఆయుష్షు, ఓర్పునకు చిహ్నంగా భావిస్తారు. సెషెల్స్ దేశంలోని సహజ సిద్ధ ద్వీపాల్లోని అరుదైన అల్దాబ్రా జెయింట్ తాబేలు ఆ దేశ జాతీయ పర్యావరణ వారసత్వానికి ప్రతీక కూడా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అందించిన ఈ ఇత్తడి తాబేలు కానుక సెషెల్స్ పౌరుల హృదయాలను చూరగొంది. రెండు దేశాల మధ్య వర్ధిల్లే నిరంతర స్నేహానికి, పరస్పర అవగాహనకు ఈ హస్తకళాఖండం అత్యున్నత గుర్తింపుగా నిలుస్తుంది.తోడా శాలువా, కాంచీపురం పట్టు శోభ..సెషెల్స్ జాతీయ అసెంబ్లీ