మాజీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం 2021లో నమోదైన కేసులో తనపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని ఈ నెల 18న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 801 చట్టబద్ధతను సవాల్ చేశారు. 2021 ఫిబ్రవరి 16న గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తనపై ఈ కేసు నమోదైందని.. రాజకీయ దురుద్దేశంతో ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని జీవో 801 రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ రద్దు చేయాలని హైకోర్టును కొడాలి నాని కోరారు. 2021 ఫిబ్రవరిలో ఘటన జరిగిందని.. క్రిమినల్ చట్టాల ప్రకారం తనపై నమోదైన సెక్షన్ల కింద కేసును కాగ్నిజెన్స్‌లోకి తీసుకొనే కాలపరిమితి ముగిసిందని కొడాలి నాని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది.గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయంలో అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి నాని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్నారు. ఈ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపారు. ఆ తర్వాత స్థానిక కోర్టు అనుమతితో గుడివాడలో పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల అంశంపై దర్యాప్తు చేసి.. కొడాలి నాని అప్పుడు మంత్రిగా ఉండటంతో ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. గత ప్రభుత్వంలో ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వలేదు.. తాజాగా ఈ కేసులో కృష్ణా జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ఈ మేరకు ఈ నెల
Actor ProfilePolitician
ఏపీ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్.. ఆ ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Jul 2026
ఏపీ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్.. ఆ ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని