ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు
Actor ProfileCelebrity

ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు
Zee Telugu8 Sept 2026
ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Andhra Pradesh Gold Mines: ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్లలో భారీగా బంగారం నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గనుల్లో ఉత్పత్తి ప్రారంభం చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బంగారుగనుల వేట మొదలైంది. శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కూడా ఖనిజాన్వేషణ జోరుగా సాగుతోంది. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ నిధులు సహాయంతో ఈ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. బంగారం అన్వేషణ జరిగే 4 కీలక దశలు.. భూమిలో బంగారు నిలవాలని గుర్తించి, మైనింగ్ ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు నాలుగు దశల ప్రక్రియను అనుసరిస్తారు. G4 దశ (ప్రాథమిక పరిశీలన): తొలి దశలో అక్కడ మట్టి రాళ్లను పరీక్షించి బంగారం లభించే అవకాశం ఉందో లేదో నిర్ధారిస్తారు. G3 దశ (నమూనాల సేకరణ): సగటున ప్రతి 400 మీటర్లకు ఒక బోర్వెల్ వేసి భూమి లోపల నుంచి నమూనాలను శాంపిల్స్ తీసి పరిశీలిస్తారు. G2 దశ (విస్తృత అన్వేషణ): G3 ఫలితాలను సానుకూలంగా వస్తే మరింత స్పష్టత కోసం ప్రతి 200 మీటర్ల దూరం నుంచి ఒక బోర్వెల్ వేసి అన్వేషిస్తారు. G1 దశ (మైనింగ్ అనుమతి): పూర్తి నివేదికల ఆధారంగా ఖనిజాల లీజులను కేటాయించి.. వాణిజ్యపరమైన మైనింగుకు అనుమతిస్తారు. వివిధ జిల్లాల్లో బంగారు అన్వేషణ పురోగతి వివరాలు.. జౌకులు (శ్రీ సత్యసాయి జిల్లా) 5000 హెక్టార్లు నంబలపూలకుంట మండలం జౌకుల పరిధిలోని భూములను 1000