ఒకప్పుడు ప్రపంచ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్స్ విడి భాగాలు, పీసీబీల కోసం చైనాపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు అదే చైనాకు వాటిని భారీగా ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు) వంటి క్లిష్టమైన భాగాలను స్వయంగా తయారు చేసి 'వాల్యూ చైన్'లో పైకి వెళ్తోంది. 2025లో కేవలం 36 మిలియన్ డాలర్లుగా ఉన్న పీసీబీ ఎగుమతులు.. 2026 నాటికి 1.5 బిలియన్ డాలర్లకకు పెరిగాయి. భారతదేశం మొత్తం PCB ఎగుమతులలో దాదాపు 80 శాతం చైనాకే వెళ్తున్నాయి. చైనాకు పీసీబీ ఎగుమతుల అంశంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలక శక్తిగా ఎదుగుతోందన్నారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ప్రపంచ స్థాయి పీసీబీ, ఈఎంఎస్ (EMS), ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కేంద్రం రూపుదిద్దుకుంటోందన్నారు లోకేష్. దీని కోసం ఒక ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో ఏపీ కీలకంగా మారబోతుందన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పీసీబీ తయారీ యూనిట్‌ను నాయుడుపేటలో రూ.1,595 కోట్ల భారీ పెట్టుబడితో సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ (SSEPL) సంస్థ ఏర్పాటు చేస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన షిన్‌హ్యూప్ ఎలక్ట్రానిక్స్‌తో కలిసి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. గతేడాది స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటుకు గతేడాది ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ విధానం కింద భారీ రాయితీలు లభించాయి. ఈ యూనిట్ ద్వారా 2,170 మందికిపైగా నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. మంత్రి లోకేష్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పీసీబీ, ఈఎంఎస్ (EMS), ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో కీలకంగా మారబోతుందన్నారు. ఏపీ ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన
Actor ProfilePolitician
ఏపీలోని ఆ ప్రాంతం ప్రపంచస్థాయికి ఎదగబోతోంది.. మన దేశంలోనూ కీలకం కాబోతోంది
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Sept 2026
ఏపీలోని ఆ ప్రాంతం ప్రపంచస్థాయికి ఎదగబోతోంది.. మన దేశంలోనూ కీలకం కాబోతోంది