ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్
Actor ProfilePolitician

ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్
Oneindia Telugu31 Jul 2026
ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

ఏపీ ప్రభుత్వం కేంద్రంలో తమకు ఉన్న పవర్ ని అడుగడుగునా చూపిస్తూనే ఉంది. తాజాగా కేంద్రాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే మరో కీలక పథకం వీ బీ జీ రామ్ జీ పథకం ఏపీ నుండే ప్రారంభించేలా ఏపీ సర్కార్ ఒప్పించింది. ముఖ్యంగా ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీని ఎంచుకుని జాతీయ స్థాయి పథకాన్ని ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.జాతీయస్థాయి పథకం ప్రారంభం ఏపీ నుండేజులై 2న తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లి గ్రామం ఈ గొప్ప కార్యక్రమానికి వేదిక అవుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్ అనే పూర్తిపేరుతో వీబీ జీ రామ్ జీ (VB-G RAM G) కొత్త పథకం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనం మార్చేస్తుందని అంటున్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ను రద్దుచేసి దాని స్థానంలో ఇది తీసుకొచ్చారు. పథకం లాంచ్ కి హాజరయ్యే ప్రముఖులు వీరేజులై నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ పథకం ఏపీలోనే మొదటి సారి జాతీయ స్థాయిలో లాంచ్ అవుతోంది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరవుతారు. ఉదయం 11 గంటలకు ముక్కావారిపల్లిలో ఈ కార్యక్రమం జరగనుంది.పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిని అంగీకరించిన కేంద్రంపవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో కేంద్ర మంత్రిని కలిసి ఈ పథకం ఏపీలోనే ప్రారంభించాలని మనవి చేశారు. ఆయన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి కేంద్రం అంగీకరించింది. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, తిరుపతి జిల్లా అధికారులు స్థలాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి
Oneindia Telugu31 Jul 2026
ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి

ఏపీలో తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆదరణ లేని చిన్నారుల జీవితాల్లో చీకట్లు తొలగించే మంచి పథకం మళ్లీ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం