ఏపీలో కుండపోత వర్షం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Actor ProfileCelebrity

ఏపీలో కుండపోత వర్షం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Total News1
Movie Updates0
Sources1
ఏపీలో కుండపోత వర్షం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Zee Telugu15 Jun 2026
ఏపీలో కుండపోత వర్షం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Weather update on Andhra Pradesh: బంగాళాఖాతంలో ద్రోణితో పాటు నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ,ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, నంద్యాల ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు ఈదురు గాలుతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన ఈ సమయంలో చెట్ల కింద భారీ హోర్డింగల వద్ద నిలబడవద్దని సూచించింది. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉరుములతో కూడిన వర్షపాతం నమోదు అయింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కాకినాడ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇకఆదివారం రోజు వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 3.3 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా లావేరులో 3.2, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కుండపోత

ఏప ల క డప త వర ష ఆ జ ల ల లక ర డ అలర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in