ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్
Actor ProfilePolitician

ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్
AP7AM27 Aug 2026
ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కెశిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ కుమార్‌లను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మద్యం రవాణా పాలసీ విధానంలో జరిగిన అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 196.33 కోట్ల మేర గండిపడిందని ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన మద్యం రవాణా విధానాలపై పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు, కీలక పత్రాలు, టెండర్ల వివరాలను నిందితుల నుండి రాబట్టాల్సి ఉందని, అందుకే వారి కస్టడీ అవసరమని ఈడీ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి... ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులను ఆదేశించారు. ఇరుపక్షాల ప్రాథమిక వాదనల అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈనాటి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది

ఏప ల క కర స క మ మ గ గ ర న ద త లన కస టడ క ఇవ వ ల ట ఈడ ప ట షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in