ఏపీ మనమిత్ర వాట్సాప్ తో ఆలయాలకు రూ.22.26 కోట్ల ఆదాయం.. ఆ ఆలయానికి ఎక్కువ
Actor ProfilePolitician

ఏపీ మనమిత్ర వాట్సాప్ తో ఆలయాలకు రూ.22.26 కోట్ల ఆదాయం.. ఆ ఆలయానికి ఎక్కువ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ మనమిత్ర వాట్సాప్ తో ఆలయాలకు రూ.22.26 కోట్ల ఆదాయం.. ఆ ఆలయానికి ఎక్కువ
Samayam Telugu18 Jul 2026
ఏపీ మనమిత్ర వాట్సాప్ తో ఆలయాలకు రూ.22.26 కోట్ల ఆదాయం.. ఆ ఆలయానికి ఎక్కువ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌తో దేవాదాయశాఖకు చెందిన ఆలయాలకు భారీగా ఆదాయం వస్తోంది. మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులు రాష్ట్రంలోని 21 ఆలయాల్లో దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల్ని బుక్ చేసుకుంటున్నారు. కొంతకాలంగా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇలా ఆలయాలకు వాట్సాప్ గవర్నరెన్స్ ద్వారా ఏకంగా రూ.22.26 కోట్ల ఆదాయం వచ్చింది. మే 11 నుంచి జూన్ 11 వరకు చూస్తే రూ.12.91 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. భక్తులు టికెట్లు బుక్ చేసుకోవడం మాత్రమే కాదు.. ఈ-హుండీ ద్వారా కానుకల్ని అందజేస్తున్నారు.మనమిత్ర వాట్సాప్‌లో శ్రీకాళహస్తి ఆలయానిక నెల రోజుల్లో అత్యధికంగా రూ.3.39 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో స్థానంలో అన్నవరం ఆలయానికి రూ.2 కోట్లు, మూడో స్థానంలో శ్రీశైలం మల్లన్న ఆలయానికి రూ.1.77 కోట్లు, నాలుగో స్థానంలో ద్వారకా తిరుమల ఆలయానికి రూ.1.54 కోట్లు, ఐదో స్థానంలో విజయవాడ దుర్గమ్మ ఆలయానికి రూ.1.53 కోట్లు, ఆరో స్థానంలో సింహాచలం దేవాలయానికి రూ.1.04 కోట్లు, ఏడో స్థానంలో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.66.11 లక్షల ఆదాయం వచ్చింది.ఏపీ ప్రభుత్వ అప్డేట్స్ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి పండగను నిర్వహించనుంది. రైతులు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని అత్యంత పర్వదినంగా భావిస్తారు.. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఏరుకావ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. గుంటూరు లాం ఫాంలో జరిగే కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొంటారరు. రైతులు ఆ రోజు పశువులను, వ్యవసాయ పరికరాలను శుభ్రం చేసి అలంకరించి వ్యవసాయానికి సిద్ధం చేస్తారన్నారు వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్‌ జిలానీ.ఆంధ్రప్రదేశ్‌లో 2025లో భారీ వర్షాలు, వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నష్టపోయిన 10,119మంది ఉద్యాన రైతులకు పెట్టుబడి రాయితీ, ఇతర సాయం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8,49,18,494 చెల్లించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి విధివిధానాల ప్రకారం ఈ

ఏప మనమ త ర వ ట స ప త ఆలయ లక ర 22 26 క ట ల ఆద య ఆ ఆలయ న క ఎక క వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in