ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా సీఎం చంద్ర బాబు.. గూగుల్
Actor ProfilePolitician

ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా సీఎం చంద్ర బాబు.. గూగుల్

Total News1
Movie Updates0
Sources1
ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా సీఎం చంద్ర బాబు.. గూగుల్, ఎన్ యూఎస్ తో కీలక
AP7AM15 Jun 2026
ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా సీఎం చంద్ర బాబు.. గూగుల్, ఎన్ యూఎస్ తో కీలక

సింగ‌పూర్ ప‌ర్య‌ట‌నలో ఉన్న సీఎం చంద్ర‌బాబు నాయుడు వివిధ సంస్థ‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ బిజీగా ఉన్నారు. ఏపీని టెక్నాలజీ, విద్యారంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ క్లౌడ్, సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం (ఎన్‌యూఎస్) ఉన్నత స్థాయి ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.ఏపీలో ఏఐ, డిజిటల్ విప్లవం... గూగుల్‌తో భాగస్వామ్యంముందుగా గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చేసే అంశంపై ఇరువురు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్‌ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలో సహకరించాలని చంద్రబాబు గూగుల్ క్లౌడ్‌ను కోరారు. గతంలో తాను ప్రవేశపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీఎస్) వ్యవస్థను ఆధునిక క్లౌడ్ టెక్నాలజీలతో మరింత శక్తివంతం చేయడంపై చర్చించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో గూగుల్ సహకారంతో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్