
Andhra Jyothy•5 Sept 2026
ఏపీఎన్ ఆర్టీ సమన్వయకర్తల నియామకంవిదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేసేందుకు ఏపీఎన్‌ఆర్టీ సమన్వయకర్తలను ప్రభుత్వం నియమించింది. అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేసేందుకు ఏపీఎన్‌ఆర్టీ సమన్వయకర్తలను ప్రభుత్వం నియమించింది. వీరు ఏపీఎన్‌ఆర్టీతో సమన్వయం చేసుకుంటూ తాము నివసించే ప్రాంతాల్లోని ఏపీకి చెందిన ఎన్‌ఆర్‌ఐల సంక్షేమానికి, అభ్యున్నతికి కృషి చేస్తారు. భారత ఎంబసీలు, స్థానిక ప్రభుత్వాలతోనూ సమన్వయం చేసుకుని స్వచ్ఛంద సేవలను అందిస్తారు. కొత్తగా నియమితులైన సమన్వయకర్తలకు ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు శుభాకాంక్షలు తెలిపారు