ఏఐ మార్ఫింగ్ అశ్లీల ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్
Actor ProfilePolitician

ఏఐ మార్ఫింగ్ అశ్లీల ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఐ మార్ఫింగ్ అశ్లీల ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్
Andhra Jyothy27 Jun 2026
ఏఐ మార్ఫింగ్ అశ్లీల ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు. విశాఖపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు షణ్ముఖ్ హితేష్ వద్దే ట్యూషన్ చదువుతున్న మైనర్ విద్యార్థినిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ఫొటోలను సేకరించి, ఏఐ టూల్స్ ఉపయోగించి అసభ్యకరంగా మార్పులు చేసి, ఆ చిత్రాలను చూపిస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. అలాగే తన మాట వినకపోతే ఆ ఫొటోలను ఇతరులకు పంపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని బాలిక ధైర్యంగా తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో నిందితుడు ఏఐ ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం షణ్ముఖ్ హితేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనతో ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి బెదిరింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు

ఏఐ మ ర ఫ గ అశ ల ల ఫ ట లత బ ల క మ య ల ట య షన ట చర అర స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in