ఏఐ’తో ఆట’లొద్దు
Actor ProfileActor

ఏఐ’తో ఆట’లొద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఐ’తో ఆట’లొద్దు
Sakshi30 Aug 2026
ఏఐ’తో ఆట’లొద్దు

మనుషులకంటే ఏఐ బాగా అర్ధం చేసుకుంటుందనుకుంటున్న జనం ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్న 65 శాతం మంది భారతీయులు ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకు పైగా ఎక్కువ చిన్నారుల్లో భారీగా పెరుగుతున్న ఏఐ వినియోగం పిల్లల్లో స్వయంగా ఆలోచించే శక్తి తగ్గిపోయే ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న ‘భారత్‌ సర్వే ఫర్‌ ఎడ్‌టెక్‌–2025’ గణాంకాలు సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మన దేశంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ గ్లోబల్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ సర్వే–2024 ప్రకారం భారతీయుల్లో 65 శాతం మంది జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కవ. విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అదే సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, గోప్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘భారత్‌ సర్వే ఫర్‌ ఎడ్‌టెక్‌ 2025’ అధ్యయనం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ముగ్గురిలో ఒకరు వారి వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలను ఏఐతో పంచుకుంటున్నారు. ఏఐతో వ్యక్తిగత విషయాలు చర్చించిన వారిలో 25 శాతం మంది ‘మనుషుల కంటే ఏఐ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’ అని భావిస్తున్నారు. ఆలోచనా శక్తిపై ప్రభావం ఇదే సర్వేలో మరో ఆందోళనకర అంశం బయటపడింది. ఏఐ గురించి తెలిసిన పిల్లల్లో 75 శాతం మంది ఏఐ పనితీరుపై అవగాహన లేక దాన్నొక సెర్చ్‌ ఇంజిన్‌లా భావిస్తున్నారు. అలాగే 46 శాతం కుటుంబాలు ఏఐ వల్ల తప్పుడు సమాచారం (మిస్‌ఇన్‌ఫర్మేషన్‌) వచ్చే ప్రధాన ప్రమాదమని పేర్కొన్నాయి. ఏఐ వెంటనే సమాధానాలు అందించడం వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలను