ఎస్ క్యూబ్ .. లోకేష్ సక్సెస్ ఫార్ములా
Actor ProfilePolitician

ఎస్ క్యూబ్ .. లోకేష్ సక్సెస్ ఫార్ములా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎస్ క్యూబ్ .. లోకేష్ సక్సెస్ ఫార్ములా
TeluguOne7 Jul 2026
ఎస్ క్యూబ్ .. లోకేష్ సక్సెస్ ఫార్ములా

జాతీయ రాజకీయ యవనికపై ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు. రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ 'నేషన్ ఫస్ట్' అనే థీమ్‌తో హస్తిన వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ సదస్సులో షేపింగ్ పవర్ గా ఇండియా అనే ప్యానెల్ చర్చలో పాల్గొన్న నారా లోకేష్ ప్రపంచలొ ఇండియాను అగ్రస్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలనే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు విజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తోడ్పడుతోందో కళ్లకు కట్టారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న S³.. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఫార్ములాను ఆయన ఈ వేదికపై ప్రకటించారు. ఈ సదస్సులో జాతీయ మీడియా ప్రతినిధులు సంధించిన క్లిష్టమైన ప్రశ్నలను లోకేష్ తనదైన శైలిలో ఎదుర్కొని పరిణితితో సమాధానాలు ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎంపీల బలం ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు దక్కుతున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన.. కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి లోకేష్ ఇచ్చిన ఉదాహరణకు ప్యానెల్ సభ్యులు సైతం ఫిదా అయ్యారు. కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తోందని సమాచారం అందగానే, మిగతా రాష్ట్రాలు ఇంకా ఆ దిశగా ఆలోచించకముందే ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా స్పందించిందన్న లోకేష్.. ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, కేవలం 37 రోజుల్లోనే ఏకంగా 600 ఎకరాల భూమిని ఆ ప్రాజెక్ట్ కోసం కేటాయించామనీ. . ఈ స్థాయి వేగం వల్లే రక్షణ శాఖ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమైందన్నారు. ఇ ఈ వేగం కేవలం ఏపీ వృద్ధికే

ఎస క య బ ల క ష సక స స ఫ ర మ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in