ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని మనస్తత్వం జగన్ ది
Actor ProfilePolitician

ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని మనస్తత్వం జగన్ ది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని మనస్తత్వం జగన్ ది
Andhra Jyothy2 Sept 2026
ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని మనస్తత్వం జగన్ ది

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని చూస్తుంటే, జగన్ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. కృష్ణా జిల్లా: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని చూస్తుంటే, జగన్ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు ముందుకెళ్తుంటే, జగన్ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సైకో ఆలోచనలు కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడనే దానికి నిన్న (బుధవారం) జగన్ మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. జగన్ కాసేపు అమరావతే రాజధాని అని అంటారని.. మరికాసేపు 'లేదు, మా స్టాండ్ మావిగన్' అని మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్ పార్టీ అధినేత ఆలోచనా విధానాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గమనించాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముందేమో వారిది అమరావతి స్టాండ్ అని చెప్పారన్నారు. ఎన్నికల ముందు, గెలిచిన తర్వాత మూడు రాజధానుల పేరిట ఆటలాడారని మండిపడ్డారు. మూడు రాజధానులని చెప్పి ఎన్నికల్లోకి వెళ్లగా, ప్రజలు 11 సీట్లకే ఆయనను పరిమితం చేశారని అన్నారు. ఈ రోజు మళ్లీ వచ్చి 'మావిగన్' అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని మనస్తత్వం ఉన్నవాడినే సైకో అంటారని పేర్కొన్నారు. ఏం మాట్లాడుతారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితి జగన్‌దని ఎద్దేవా చేశారు. జగన్ మొన్న తన మనుషులను పంపించి రాజధానిలో సీఆర్‌డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. దీంతో అక్కడి రైతులు, ప్రజలు వారిని తరిమి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. ఇంకా ఈ దొంగ డ్రామాలు, నాటకాలు ఆడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా?