ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు
Actor ProfilePolitician

ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు
Asianet News Telugu27 Jul 2026
ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు

Telangana Weatherman : టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో మన పూర్వీకులు ఆకాశంవైపు చూసి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేవారు. ఎప్పుడు ఎండ ఉంటుంది? ఎప్పుడు వర్షం పడుతుంది? అనేది కచ్చితంగా చెప్పేవారని కథలు కథలుగా చెప్పడం విన్నాం. ముఖ్యంగా రైతులు పంటలు కాపాడుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడేది. ఇప్పుడు కూడా సరిగ్గా ఇదే పని చేస్తున్నాడో తెలుగు కుర్రాడు. తెలంగాణ వెదర్ మ్యాన్ పేరిట రాష్ట్ర వాతావరణ సమాచారాన్ని అందిస్తున్న కుర్రాడి గురించి తెలుసుకుందాం. టి. బాలాజి అంటే ఎవరూ గుర్తుపట్టరు... కానీ తెలంగాణ వెదర్ మ్యాన్ గా లక్షలాదిమంది తెలుగోళ్లకు పరిచయం ఈ కుర్రాడు. హైదరాబాద్ లో నివాసముండే బాలాజి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. చిన్నప్పటినుండే ఇతడు నేచర్ ను ఎంతో ఇష్టపడేవాడు.. అందుకే వాతావరణ మార్పులను పరిశీలించడం అలవాటయ్యింది. ఇదే అతడిని ఇప్పుడు తెలంగాణ వెదర్ మ్యాన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓవైపు వాతావరణానికి సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో నేర్చుకుంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తున్నాడు బాలాజీ. ఇలా ఒకేసారి వాతావరణ నిపుణుడిగా, డిగ్రీ పట్టభద్రుడిగా మారాడు. ఇటీవలే హైదరాబాద్ లోని జవహార్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (JNTU) నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బిటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువులు కొనసాగిస్తూనే వెదర్ ను స్టడీ చేస్తూ ప్రజలకు ఫ్రీగా సమాచారం అందిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనవంతుగా సమాజ సేవ చేస్తున్నానని... ఈ వెదర్ రిపోర్ట్ అందించి డబ్బులు సంపాదించాలనే ఆలోచన తనకు లేదని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నాడు. తెలంగాణ వెదర్ మ్యాన్ గా గుర్తింపుపొందిన బాలాజీ వద్ద ఎలాంటి అత్యాధునిక పరికరాలు లేవు. అయినా అతడు IMD (భారత వాతావరణ సంస్థ) లాంటి ప్రభుత్వ సంస్థల మాదిరిగా కచ్చితమైన సమాచారం అందిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అవుతుందో బాలాజీయే వివరించాడు. చిన్నప్పటినుండి వాతవారణంపై తాను పెంచుకున్న అవగాహన, ఇతర సంస్థల సమాచారాన్ని

ఎవర త ల గ ణ వ దర మ య న ఎప ప డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in