
ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్‌గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి! తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్‌లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం వినియోగించడం ఆకట్టుకుంది. అయితే ఈ ట్రెండ్‌కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్‌ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది. అలాగే