ఎల్ నినోను తట్టుకునే ఉపాయాలు
Actor ProfilePolitician

ఎల్ నినోను తట్టుకునే ఉపాయాలు

Total News1
Movie Updates0
Sources1
ఎల్ నినోను తట్టుకునే ఉపాయాలు
Sakshi16 Jun 2026
ఎల్ నినోను తట్టుకునే ఉపాయాలు

విత్తనాలను ‘విత్తన గుళికలు’గా మార్చి విత్తుకుంటే మేలు ఎత్తుమడులపైనే ఏ ఆరుతడి పంటైనా వేసుకుంటే ఆదాయ భద్రత కందకాలు తవ్వుకుంటే పంటలకు నీటి భద్రత తథ్యం ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్‌నినో ప్రారంభమైందని భారతీయ వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ. వర్షం ఎప్పుడు, ఎంత పడుతుందో తెలియదు.. వర్షాల మధ్య ఎంత గ్యాప్‌ ఉంటుందో తెలియదు.. ఉన్నట్టుండి ఎప్పుడు కుండపోత వర్షం పడుతుందో తెలియదు.. ఇటువంటి కరువు పరిస్థితులను రైతులు కొంతమేరకైనా తట్టుకునేందుకు ఉపయోగపడే వ్యవసాయ, నీటి సంరక్షణ పద్ధతులపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.. విత్తన గుళికలు తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవడానికి విత్తనాలను గుళికలుగా మార్చడం ఎంతో లాభదాయకం. ఈ పద్ధతిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో, రైతులు ఇప్పటికే అనుసరిస్తున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు పొరలుగా (గోనె పట్టా సహాయంతో ఒక ప్రత్యేక పద్ధతిలో) లేపనం చేయడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3–5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మట్టిలో కేవలం 10–15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25–40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగలవు. పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొన్ని రకాల నూనె గింజలు, కొన్ని రకాల కూరగాయ విత్తనాలు విత్తన గుళికల తయారీకి అనువైనవి. కచ్చితంగా 5 సెం.మీ. (2 అంగుళాల) లోతులో మాత్రమే విత్తుకోవాలి. కందకాలు కురిసిన వర్షపు నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపజేసుకుంటే పంటలకు నీటి భద్రత దొరుకుతుంది