
అల్పపీడనాలు ఏర్పడ్డా వర్షాలు పడేది ఈశాన్య రాష్ట్రాల్లోనే వర్షాల్లేక సాగర్, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాదు జలవిద్యుత్తుపైనా ప్రభావం.. థర్మల్ విద్యుత్తుకూ సమస్యే తాగునీటి సమస్యలూ.. కోస్తాంధ్రలో తీరానికి కోత? రైతులతోపాటు ఆక్వా సాగుదారులకూ కష్టమే ఐవోడీ బలపడడానికి సమయం పడుతుంది.. 1997కు మించి విపత్కర స్థితి.. ఎల్‌నినోను భూతంలా చూడక్కర్లే 4-7 ఏళ్లకు ఒకసారి ఏర్పడడం సహజమే భూతాపానికి, ఎల్‌నినోకు సంబంధం లేదు ఇన్‌కాయిస్ సీనియర్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హైదరాబాద్ సిటీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని.. ‘భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్‌కాయిస్)లోని ఓషన్ మోడలింగ్ అండ్ డేటా ఎస్సిమిలేషన్ (ఓఎండీఏ) విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హెచ్చరించారు. వర్షాలు సరిగా పడకపోవడంతో నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాక.. జల, ధర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. 1997లో వచ్చిన ఎల్‌నినో కంటే తీవ్రమైన పరిస్థితులు ఈసారి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. అయినప్పటికీ.. ఎల్‌నినోను పెద్ద భూతంలా చూడాల్సిన పని లేదని.. అది సహజసిద్ధంగా జరిగే పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఎల్‌నినోలపై విస్తృత స్థాయిలో పరిశోధన చేసిపలు పత్రాలను ప్రచురించిన ఆయన.. తాజాగా ఏర్పడ్డ ఎల్‌నినో ప్రభావం మన దేశంపైన, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే అంశంపై ‘ఆఽంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సమస్యలు తప్పకపోవచ్చు.. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అరేబియాలో కాస్త తక్కువగా ఉండవచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే, వాటి దిశ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి. కోస్తా తీరప్రాంత జాలరులు నష్టపోయే అవకాశాలెక్కువ. ముఖ్యంగా కోస్తాంధ్రపై ఎల్‌నినో ప్రభావం కాస్త ఎక్కువగా