
వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం నాడు హీరోయిన్ రాశీ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? పక్కింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది. విత్ అవుట్ మేకప్ నటించాను. చాలా వరకు నేచురల్‌గానే కనిపిస్తాను. ఇందులో కంప్లీట్ మదర్ పాత్రలా ఉండదు. ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. వడ్డే నవీన్ గారి గురించి ముందు ఏమైనా తెలుసుకున్నారా? వడ్డే నవీన్ గారితో సినిమా అని తెలిశాక చాలా వరకు ఆయన గురించి రీసెర్చ్ చేశాను. ఆయన నటించిన ఎన్నో చిత్రాల గురించి తెలుసుకున్నాను. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు అని అందరి కంటే ముందుగా నేను ఆయన్ను అడిగాను (నవ్వుతూ). ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో మీ పాత్ర ఎలాంటి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది? భర్తకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా ఉండే ఓ చక్కటి గృహిణిగా లక్ష్మీ పాత్ర ఉంటుంది. నేను రియల్ లైఫ్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటాను. లక్ష్మీ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ఈ ట్రాన్స్‌ఫర్స్ విషయంలో లక్ష్మీ అనే కారెక్టర్ ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిరాకు పడినా కూడా భర్తకు ఎప్పుడూ అండగానే ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ పాత్ర అవుతుంది. దర్శకుడితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి? కమల్ గారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఆయనకు ఏం కావాలో అది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. లక్ష్మీ ఎలా ఉండాలో.. అలానే ఉండాలని ఆయన చెబుతుంటారు