ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం
Actor ProfileActor

ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం
Sakshi30 Aug 2026
ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం

రంగారెడ్డిలో 32%, మేడ్చల్‌లో 37%, హైదరాబాద్‌లో 42% ఓటర్లకే అందిన ఫారాలు రాష్ట్రంలోని 33% ఓటర్లు ఈ మూడు జిల్లాల పరిధిలోనే.. మరో రెండు రోజుల్లో మొదలుకానున్న ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026లో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా బుధవారం రాత్రి నాటికి 2.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ జరిగింది. ఇందులో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 32 శాతం, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో 37 శాతం, హైదరాబాద్‌ జిల్లాలో 42 శాతం మంది ఓటర్లకే ఎన్యూమరేషన్‌ ఫారాలు అందాయి. సర్‌–2026 షెడ్యూల్‌ ప్రకారం గత నెల 24న ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీని ప్రారంభించగా వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. మరో 2, 3 రోజుల్లో గ్రామీణ జిల్లాల్లో ఫారాల పంపిణీ పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ మూడు జిల్లాల్లో గరిష్టంగా 70 శాతానికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ జరిగే అవకాశం లేదని అంచనా వేశారు. రాష్ట్రంలోని 33.75 శాతం ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉండగా ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీలో తీవ్రంగా వెనుకబడటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల మ్యాపింగ్‌లో సైతం ఈ మూడు జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఫారాలను నింపి ఈ నెల 24లోగా స్థానిక బీఎల్‌ఓలకు అందించే ఓటర్ల పేర్లనే ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురించనున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ మూడు జిల్లాల్లోనే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిలకడ లేని ఓటర్లు... వలసల్లో భాగంగా తరచూ అద్దె ఇళ్లు మారడం, ఉద్యోగాల మార్పు, విద్యార్థులు, ఐటీ

ఎన య మర షన ఫ ర లక ష య న క ద ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in