ఎన్టీఆర్ తో ఆ సినిమా.. ముందు నాకే నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ
Actor ProfileActor

ఎన్టీఆర్ తో ఆ సినిమా.. ముందు నాకే నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ తో ఆ సినిమా.. ముందు నాకే నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ
TV9 Telugu11 Sept 2026
ఎన్టీఆర్ తో ఆ సినిమా.. ముందు నాకే నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తన వృత్తి జీవితం, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాపై తన అభిప్రాయాలతో పాటు, తన కెరీర్‌లో ఇష్టమైన, ఇష్టం లేని చిత్రాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రం ఏదని అడగ్గా సింధూరం సినిమా తనకు చాలా ఇష్టమని అన్నారు. అలాగే తాను తెరకెక్కించిన చిత్రాల్లో తనకు నచ్చని మమూవీ సముద్రంతో పాటు రాఖీ అని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్లో తన దర్శకత్వ పనితీరు పట్ల తనకు సంతృప్తి లేదని స్పష్టం చేశారు. “లైఫ్ వితౌట్ ఫిల్మ్” లేదా “లైఫ్ వితౌట్ వైఫ్” – ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోమని అడగ్గా, కృష్ణవంశీ క్షణాల్లో “లైఫ్ వితౌట్ వైఫ్” అని సమాధానం ఇచ్చారు. సినిమాలను మినహాయించి తన జీవితాన్ని ఊహించుకోలేనని అన్నారు. తన ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎవరు అని అడగ్గా, నాగార్జున, సుంకర మధుమురళి, కృష్ణవంశీ, ఎన్ రామలింగేశ్వర రావు, కే ఎల్ నారాయణ పేర్లలో నుండి, నిన్నే పెళ్ళాడతా చిత్రంలో నాగార్జునను ఎంపిక చేసుకున్నారు. ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్.. తాను వర్క్ చేసిన హీరోలలో సినిమా అంటే ప్రాణం పెట్టే వారిలో ఎవరు ముందుంటారని అడగ్గా, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, మహేష్ బాబుల పేర్లలో ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు. తన జనరేషన్‌లో తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అని అడగ్గా, రాజమౌళి, వినాయక్, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్‌లలో శేఖర్ కమ్ముల అని స్పష్టం చేశారు. శేఖర్ కమ్ముల చిత్రాలలో ఉండే తీయదనం, నిరాడంబరమైన రొమాన్స్, వాస్తవికత, మరియు ఏ కఠినత్వం లేని సున్నితమైన కంపోజిషన్ తనకెంతో నచ్చుతాయని